NBK to Join Daada Mysore Schedule from October 5

D News : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘దాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

సెప్టెంబర్ 29 నుంచి షూటింగ్

‘దాదా’ తదుపరి షెడ్యూల్‌ను మైసూర్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 29 నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలుత ఇతర ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఆ తర్వాత అక్టోబర్ 5 నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక డ్రామా సీన్లను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని సిద్ధమవుతున్నట్లు సమాచారం.

షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు.

By Avinash