SYG | Part 2 Also Planned for Sai Durgha Tej’s ‘Sambarala Yeti Gattu’.. Producer Chaitanya Reddy Reveals Key Update

D News : మెగాహీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ‘SYG’ (సంబరాల ఏటి గట్టు) సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

2 గంటల 40 నిమిషాల రన్‌టైమ్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత చైతన్య రెడ్డి ‘SYG’కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా మొత్తం 2 గంటల 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలిపారు. ఇందులో దాదాపు 2 గంటల 38 నిమిషాల పాటు భారీ స్థాయిలో VFX ఉపయోగించినట్లు చెప్పారు.

అంతేకాకుండా సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, 2027 జనవరి 12న ‘SYG’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

పార్ట్-2పై కూడా ప్లాన్

ఇక ఈ అప్‌డేట్‌లలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ‘SYG’ పార్ట్-2. సినిమాకు రెండో భాగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చైతన్య రెడ్డి వెల్లడించారు. దీంతో ఈ యాక్షన్ డ్రామా కథ ఎలాంటి స్థాయిలో ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

భారీ VFX, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘SYG’కు పార్ట్-2 కూడా ఉంటుందనే నిర్మాత ప్రకటన ఇప్పుడు సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.

By Avinash