
d Educt: Sept 23: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రిలిమినరీ పరీక్షలను అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పరీక్ష విధానం
ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నల చొప్పున 70 ప్రశ్నలు 70 మార్కులకు ఉంటాయి.
త్వరలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు పరీక్షకు ముందుగానే సిలబస్‌ను పూర్తిచేసుకుని, మాక్ టెస్టులు, ప్రాక్టీస్ ప్రశ్నల ద్వారా సిద్ధం కావాలని సూచించారు.
