• యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధింపుపై వస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొంది. ముఖ్యంగా చిరు వ్యాపారులపై ఎలాంటి అదనపు భారం పడదని స్పష్టం చేసింది.
  • రూ.2 వేల వరకు జరిగే మర్చంట్ పేమెంట్లకు MDR పూర్తిగా సున్నా అని కేంద్రం తెలిపింది. ఈ లావాదేవీలపై జీఎస్టీ భారం కూడా ఉండదని వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మెజారిటీ డిజిటల్ చెల్లింపులకు MDR వర్తించదని పేర్కొంది.
  • MDR పై వ్యాపారి చెల్లించిన జీఎస్టీని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా క్లెయిమ్ చేసుకుని అమ్మకాలపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని కేంద్రం వివరించింది.
  • అలాగే నెలకు రూ.లక్ష వరకు UPI రశీదులు పొందే వ్యాపారులకు MDR వర్తించదని స్పష్టం చేసింది. దీంతో వారికి MDRపై జీఎస్టీ చెల్లించాల్సిన సమస్య కూడా ఉండదని తెలిపింది.
  • UPI చెల్లింపులు ఇకపై ఖరీదవుతాయన్న వాదనలు తప్పుదారి పట్టించేవేనని కేంద్రం పేర్కొంది. ప్రతిపాదిత మార్పుల వల్ల మెజారిటీ డిజిటల్ లావాదేవీలు, ముఖ్యంగా చిరు వ్యాపారుల లావాదేవీలు ప్రభావితం కావని స్పష్టం చేసింది.

By Rajini