• ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం భారీ గణపతి నిమజ్జన ట్రయల్స్‌ నిర్వహించారు. ఏసీపీ, ఖైరతాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ట్రాఫిక్‌ పోలీసులు, విద్యుత్‌ శాఖల అధికారులు సిబ్బంది ట్రయల్స్‌లో పాల్గొన్నారు.
  • గణపతి ఎత్తు వెడల్పును పరిగణనలోకి తీసుకుని నిమజ్జన మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను అధికారులు గుర్తించారు. మార్గంలో కొన్ని చెట్లు, విద్యుత్‌ వైర్లు, కటౌట్లు, కేబుల్‌ వైర్లు, విద్యుత్‌ శాఖకు చెందిన లైట్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఈ నెల 24లోగా తొలగించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
  • భారీ గణపతి నిమజ్జనాన్ని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంటుందని గురువారం ఉదయం నుంచి దర్శనాలకు భక్తులు రావద్దని పోలీసులు సూచించారు.
  • శుక్రవారం ఉదయం 6 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటల్లోపు ఎన్టీఆర్‌ మార్గంలోని క్రేన్‌ నంబర్‌ 5 వద్ద నిమజ్జనం పూర్తి చేస్తామని ఖైరతాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు. కాగా, సోమవారం విద్యుత్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana