
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిమజ్జనానికి అనుమతి కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రతి ఏటా ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్‌తో పాటు అరెస్ట్ చేసిన వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
