The Paradise Ticket Hike in Nizam Almost Confirmed? GO Awaited

D News: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ టికెట్ ధరల పెంపుపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ప్రభుత్వ అనుమతి కోరడం సాధారణమే. అదే విధంగా ‘ది ప్యారడైజ్’ కోసం కూడా టికెట్ హైక్ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా నాని తెలంగాణ ప్రభుత్వ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా ప్రత్యేక వీడియో విడుదల చేయడం కూడా చర్చకు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే టికెట్ ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక జీవో వెలువడాల్సి ఉంది. కాబట్టి టికెట్ హైక్ ఎంతవరకు ఉంటుందనేది అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. నైజాంలో టికెట్ ధరల పెంపు నిజంగా అమల్లోకి వస్తే ఓపెనింగ్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash