Sundeep Kishan on Telugu Talent: “Why Do We Undervalue Our Own People?”

D News: తమిళనాడు సీఎం విజయ్ కుమార్ జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళం, తెలుగులో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్‌వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ సినిమాతో పాటు తెలుగు హీరోలు, మన ఇండస్ట్రీ టాలెంట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘సిగ్మా’తో కొత్త కాంబినేషన్

జేసన్ సంజయ్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని సందీప్ కిషన్ తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారని చెప్పారు. సంజయ్ ఎవరితోనైనా సినిమా చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ.. తన తొలి సినిమాకు తనను హీరోగా ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అయితే తనను ‘సిగ్మా’ కోసం ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు రాలేదని, తెలుగులో మాత్రం “సందీప్‌ను ఎందుకు హీరోగా తీసుకున్నారు?” అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయని తెలిపారు.

‘మనవాళ్లను మనమే తక్కువ చేయొద్దు’

తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ‘బాహుబలి’ ఉదాహరణను సందీప్ కిషన్ ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన ఆ చిత్రానికి తొలినాళ్లలో తెలుగులోనే కొంత ప్రతికూల స్పందన వచ్చిందని గుర్తుచేశారు.

‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయని చెప్పారు. మన నటీనటులు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు తెలుగు టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

“మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. అక్కడి వాళ్లు మన టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం” అని సందీప్ కిషన్ అన్నారు.

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు

‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి సినిమా కావడంతో పాటు.. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. దీంతో రెండు భాషల ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana