ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో శ్రీధర్ బాబు మాట్లాడారు. శాసనసభలో బీఆర్ఎస్ ఉండాలని తాము కోరుకున్నామని అయితే సభలో ఆ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించడంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారని ఆరోపించారు.

అసెంబ్లీ అంటే బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శాసనసభను ఎక్కువ రోజులు నిర్వహించలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సభను నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండటం లేదని శ్రీధర్ బాబు అన్నారు.

By Rajini