
D News: ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాల్లో నటించడం అంటే ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో చాలామంది నటీనటులు ఇతర సినిమాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న **‘వారణాసి’**లో పృథ్విరాజ్ కీలకమైన ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.
‘వారణాసి’తో పాటు 9 సినిమాలు
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వారణాసి’లో నటిస్తూనే పృథ్విరాజ్ ఏకంగా 9 ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారట. ఇందులో నటుడిగా చేసిన సినిమాలతో పాటు, దర్శకుడిగా తెరకెక్కించిన ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవైపు రాజమౌళి సినిమా కోసం డేట్స్ కేటాయిస్తూ.. మరోవైపు ఇతర కమిట్‌మెంట్లను పూర్తి చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పృథ్విరాజ్ పక్కా ప్లానింగ్‌తోనే ఈ షెడ్యూల్‌ను మేనేజ్ చేసినట్టు టాక్.
‘వారణాసి’లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి పృథ్విరాజ్ కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్, పురాణ అంశాలు, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
