
D Educt: Sept 15: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేశ్ అభ్యర్థులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
AP TET 2026లో ఇన్ సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది అర్హత పొందారు. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టేందుకు టెట్ అర్హత కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు.
అదేవిధంగా టెట్‌లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని మంత్రి కోరారు. మరింత పట్టుదలతో, మెరుగైన ప్రణాళికతో పరీక్షకు సిద్ధమై తదుపరి అవకాశాల్లో విజయం సాధించాలని సూచించారు.
AP TET 2026 ఫలితాలను tet2dsc.apcfss.in అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలాగే 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
