From the Makers of ‘Ramayan’ Comes Another Grand Film.. ‘Srimad Bhagavatam’ to Be Made in Seven Parts

D News: భారతీయ పురాణ గాథలను వెండితెరపైకి తీసుకొచ్చే మరో భారీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోంది. ‘శ్రీమద్భాగవతం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను మొత్తం ఏడు భాగాలుగా రూపొందించనున్నారు. తొలి భాగానికి ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్–విష్ణురథ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

సాగర్ పిక్చర్స్ నుంచి భారీ ప్రాజెక్ట్

‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి పాపులర్ సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న సాగర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామానంద్ సాగర్ మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. భారీ సెట్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.

‘శ్రీమద్భాగవతం’ తొలి భాగాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana