
D Educt: Sept 11: RIMC ప్రవేశ పరీక్ష ఇకపై NTA ఆధ్వర్యంలో
దేహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC)లో 8వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే RIMC ప్రవేశ పరీక్షను ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. ఇప్పటివరకు ఎస్‌సీఈఆర్‌టీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులైన విద్యార్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసేది.
ఏపీ, తెలంగాణకు ఒక్కో సీటు
RIMCలో ప్రతి రాష్ట్రానికి ఒకటి లేదా రెండు సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కో సీటు చొప్పున అందుబాటులో ఉంటుంది. ఈ కళాశాలలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు
2027 జులై నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షను NTA నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. అర్హత ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 6న ప్రవేశ పరీక్ష
RIMC 8వ తరగతి ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6న నిర్వహించనున్నారు. పరీక్ష అనంతరం అర్హత సాధించిన విద్యార్థుల తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక సైనిక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష కీలక అవకాశంగా నిలవనుంది.
