D News: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం **‘రామాయణ’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ‘రామాయణ పార్ట్-1’లో యశ్ స్క్రీన్ టైమ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రావణుడిగా యశ్ గంటకు పైగా స్క్రీన్‌పై కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

రావణుడి పాత్ర కోసం యశ్ సుమారు 55 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ పాత్రను భారీ స్థాయిలో, ప్రత్యేకమైన లుక్‌తో చూపించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రావణుడి వ్యక్తిత్వం, ఆగ్రహం, శక్తిని ప్రభావవంతంగా చూపించేలా పాత్రను డిజైన్ చేసినట్లు టాక్.ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో యశ్ రావణుడి లుక్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పార్ట్-1లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది.

కాగా, ఈ సినిమాలో రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకసిగా శోభన నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ తొలి భాగం విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

By Avinash