
D Educt: Sept 5: RRBల్లో 13,706 ఉద్యోగాలు.. సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP RRBs XV) ద్వారా 13,706 పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాల్లో 8,183 ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు, 4,256 ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులతో పాటు ఆఫీసర్ స్కేల్-II, III కేటగిరీల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీఏ, సీఏ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, ఇతర అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా పోస్టును బట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఈ నియామక ప్రక్రియ నవంబర్ 2026 నుంచి ప్రారంభం కానుంది. ఎంపిక ప్రక్రియ పూర్తైన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి లేదా మార్చి 2027 నాటికి ప్రొవిజనల్ అలాట్మెంట్ పూర్తి చేసి, సంబంధిత గ్రామీణ బ్యాంకుల్లో నియామకాలు చేపట్టనున్నారు.
