D Educt: Sept 5: AAIలో 389 ఉద్యోగాలు.. డిప్లొమా నుంచి బీఈ/బీటెక్ వరకు అర్హతలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రెగ్యులర్ ప్రాతిపదికన 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల్లో ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలు, పని అనుభవం అవసరం ఉంటుంది.

సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, బీఈ/బీటెక్, ఏంబీఏ లేదా ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండనుంది.

2026 సెప్టెంబర్ 7 నాటికి మేనేజర్ పోస్టులకు గరిష్ఠ వయసు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, అనుభవం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి.