D News: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘అచ్చ కాంగ్రెస్‌.. పచ్చ కాంగ్రెస్‌’ అంటూ వర్గాలు ఏమీ లేవని, కాంగ్రెస్‌లో అంతా ఒకే జెండా.. ఒకే ఎజెండా అని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి అన్నారు. బీసీ బిడ్డగా సీఎం రేవంత్‌రెడ్డి తనకు చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు.

‘కాంగ్రెస్‌లో అంతా ఒక్కటే’

కాంగ్రెస్‌లో వర్గాల పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సుధారాణి ఖండించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్‌, పచ్చ కాంగ్రెస్‌ అంటూ ఏమీ లేవని.. నాయకులంతా ఒకే జెండా, ఎజెండాతో పనిచేస్తున్నారని చెప్పారు.

కొండా సుస్మితపై విమర్శలు

సోషల్‌ మీడియాలో హైలైట్‌ కావాలనే ఉద్దేశంతో కొండా సుస్మిత అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని సుధారాణి విమర్శించారు. కొండా కుటుంబం గతంలో వివిధ పార్టీల్లో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు సహించం

ఇకపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని సుధారాణి స్పష్టం చేశారు. కొండా సురేఖపై సీఎం ఎలాంటి కుట్రలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా

రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తామని సుధారాణి ధీమా వ్యక్తం చేశారు. నిత్యం నెగిటివ్‌ ప్రచారం ద్వారా ప్రజల్లో నిలవాలని కొండా సురేఖ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.