D Educt: Sept 3: TG TET In-Service Teachers Exam 2026: హాల్‌టికెట్లు విడుదల.. సెప్టెంబర్ 7 నుంచి పరీక్షలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ TG TET ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్ష 2026 హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.inలో విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్, జర్నల్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగించి హాల్‌టికెట్ PDFను పొందవచ్చు.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న పేరు, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం తదితర వివరాలను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమైనా తప్పులు కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ ప్రింట్ కాపీతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునే ముందు హాల్‌టికెట్‌లో పేర్కొన్న సూచనలు, నిబంధనలను పూర్తిగా చదివి పాటించాలని అధికారులు సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana