
D News:02 September:12 రోజుల్లో రూ.200 కోట్లు.. బాక్సాఫీస్‌పై రవితేజ ‘ఇరుముడి’ మాస్ జాతర!
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
‘ఇరుముడి’ విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి శివ నిర్వాణ భావోద్వేగ కథనం తోడవడంతో సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారని మేకర్స్ చెబుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ దాటిన ఈ సినిమా.. తాజాగా మరో రూ.100 కోట్లను జోడించి రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
చిన్నారుల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు అన్ని వర్గాల వారు సినిమాను థియేటర్లలో ఆదరిస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది. భక్తి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, మాస్ అంశాలను సమపాళ్లలో కలపడం సినిమాకు కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నైజాంలో రవితేజ కెరీర్ బెస్ట్
‘ఇరుముడి’కి నైజాం మార్కెట్లో వస్తున్న వసూళ్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సినిమా ఇంకా బలమైన ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 12 రోజుల్లో నైజాంలో రూ.80.65 కోట్ల గ్రాస్, రూ.43.30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలిపింది.
12వ రోజు మంగళవారం కూడా నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. రెండు వారాలు పూర్తవుతున్నా వర్కింగ్ డేస్‌లోనూ ఈ స్థాయి కలెక్షన్లు రావడం సినిమాకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా మేకర్స్ చెబుతున్నారు.
ప్రియా భవానీ శంకర్.. బేబీ నక్షత్ర ఎమోషన్స్
సినిమాలో ప్రియా భవానీ శంకర్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారని చిత్ర బృందం పేర్కొంది. బాలనటి బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలిపింది. ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు బలంగా మారిందని చెబుతున్నారు.
‘మల్లెపూల పల్లకి’కి మంచి క్రేజ్
సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ‘ఇరుముడి’.. ఇదే జోరును కొనసాగిస్తే రూ.250 కోట్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రవితేజ కెరీర్లో ‘ఇరుముడి’ మరో భారీ విజయంగా నిలిచే దిశగా దూసుకుపోతోంది.
