
D Educt: Sept 2: ఏపీ పీజీసీఈటీ 2026-27 ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి ఏపీ పీజీసీఈటీ 2026-27 ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 3 నుంచి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
150కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కౌన్సెలింగ్ ద్వారా కల్పించనున్నారు. అర్హత ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులో కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
