తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన మూడు నెలల ఉచిత రేషన్‌ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బియ్యం తీసుకునే గడువును సెప్టెంబర్‌ 5వ తేదీ సాయంత్రం వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఆగస్టు 31తో గడువు ముగియాల్సి ఉండగా రేషన్‌ దుకాణాల వద్ద పెరిగిన రద్దీ, రాఖీ పండుగ సందర్భంగా ప్రజలు స్వస్థలాలకు వెళ్లడంతో పలువురు కోటా తీసుకోలేకపోయారు. దీంతో మరో ఐదు రోజుల అవకాశం కల్పించారు.

ఇప్పటివరకు మూడు నెలల కోటా బియ్యం తీసుకోని లబ్ధిదారులు సెప్టెంబర్‌ 5లోగా సమీప రేషన్‌ దుకాణం లేదా పోర్టబిలిటీ ద్వారా బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు. గడువు తర్వాత కోటా పొందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

మూడు నెలల రేషన్‌ బియ్యం కోటా పంపిణీ ఆగస్టు 1న ప్రారంభమై, ఆగస్టు 31తో ముగియాల్సి ఉంది. అయితే ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేయడంతో రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరిగింది. అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు స్వస్థలాలకు వెళ్లడంతో గడువులోగా బియ్యం తీసుకోలేకపోయారు.

దీంతో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఉచిత సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును మరో ఐదు రోజులు పొడిగించింది. మూడు నెలల కోటా తీసుకోని కార్డుదారులు సెప్టెంబర్‌ 5వ తేదీ సాయంత్రంలోగా సమీప రేషన్‌ దుకాణం లేదా పోర్టబిలిటీ ద్వారా బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత కోటా పొందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

By Rajini