
D Educt: Sept 1: B.Arch Admissions: సెప్టెంబర్ 3 నుంచి బీఆర్క్ ప్రవేశాల కౌన్సెలింగ్
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్య కమిషనరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడంతో పాటు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మెరిట్ జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు తదుపరి దశలో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 24న బీఆర్క్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25 నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.
