
D Educt: Aug 25: ఏపీ ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక టెట్ (Teacher Eligibility Test)కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రత్యేక టెట్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 24 వరకు ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
అక్టోబర్ 12 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అర్హత ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
