D Educt: Aug 22: ఏపీ టెట్ 2026 ప్రాథమిక కీ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET–2026) రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీని విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పేపర్ 1A, 1B, 2A, 2B పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రాథమిక ఆన్సర్ కీతో సమాధానాలను సరిపోల్చుకోవచ్చు.

అభ్యర్థులు aptet.apcfss.in లేదా tet2dsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు. దీంతో అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను అంచనా వేసుకోవచ్చు.

ఆగస్టు 5న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 21న ముగిశాయి. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

అభ్యంతరాల పరిశీలన అనంతరం సెప్టెంబరు 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. అనంతరం సెప్టెంబరు 15న ఏపీ టెట్ 2026 తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను పరిశీలిస్తూ ఉండాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana