
Dnews 20: ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలన్న అంశంపై దాఖలైన పిటిషన్ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు తిరిగి పంపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గతంలో కోర్టు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై పీటీఐ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం అవసరమైన వైద్య సదుపాయాలు ఇప్పటికే అందిస్తున్నామని చెబుతున్నాయి.
