దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన 22వ నివేదికలో వెల్లడైంది. వీటిలో 519 కేసులు పదేళ్లకు పైగా మరో 754 కేసులు ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.

నివేదిక ప్రకారం ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు విచారణలో ఉన్నాయి. మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. ఇందులో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉన్నాయి.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను వేగంగా విచారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమికస్ క్యూరీ ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు.

ఇదిలా ఉండగా, లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో 170 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

By Rajini