
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన టైటిల్స్, కథాంశాలు అధికారిక ప్రకటనకు ముందే లీక్ కావడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. గతంలోనూ ఆయన పలు చిత్రాల విషయంలో ఇలాంటి వార్తలు ముందుగానే బయటకు వచ్చాయి. తాజాగా చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా విషయంలోనూ ఓ ఆసక్తికరమైన టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కదిరి కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు నిమిషానికి పైగా నిడివి కలిగిన స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనకు ముందే టైటిల్ లీక్ కావడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. మరోవైపు మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు అభిమానులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నెట్టింట వైరల్ అవుతున్న ‘కదిరి కాకాజీ’ టైటిల్ నిజమేనా? ఆగస్టు 22న విడుదల కానున్న గ్లింప్స్‌తో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
