
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు మంచి స్పందన రాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది.
ట్రైలర్లో యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అంశాలను చూపించారు. గ్రామంలో వరుసగా యువతులు హత్యకు గురవుతుండటంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ఈ ఘటనల వెనుక ఉన్న రహస్యం ఏంటి? పాఠశాలల చుట్టూ జరుగుతున్న కుట్ర ఏమిటి? అనేది సినిమాలో కీలకంగా కనిపిస్తోంది.
ఇక రవితేజ పాత్రకు మద్యం అలవాటు బలహీనతగా చూపించగా.. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకునే వ్యక్తిగా మరో కోణాన్ని పరిచయం చేశారు. ప్రియా భవానీ శంకర్ ఆయన భార్యగా, బేబీ నక్షత్ర కూతురిగా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో ‘ఇరుముడి’పై అంచనాలు మరింత పెరిగాయి.
