
టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఇకపై ఈ పదవిని కొనసాగించేందుకు తాను ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 18న టాటా సన్స్ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టాటా గ్రూప్‌లో తన 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నానని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన టాటా గ్రూప్‌కు సేవలందించే అవకాశం దక్కడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
