కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి సమయంలో కుటుంబ శ్రేయస్సు కోసం వారు పెట్టిన పెట్టుబడుల కోసం మిగతా సభ్యులు నానా ఇబ్బందులు పడాల్సివస్తే మరింత కుంగుబాటు తప్పదు ఎవ్వరికైనా. అయినప్పటికీ చాలా కుటుంబాలు ఇప్పుడు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మదుపరి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు.. రకరకాల పత్రాలను సమర్పించాల్సి వస్తున్నది మరి. ఈ క్రమంలో పేర్లలో తప్పులు, చిరునామాలో అభ్యంతరాలు, సంతకాలు సరిపోవడం లేదని.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ.. భారతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ)కు పలు సూచనలు చేసింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల బదిలీ ప్రక్రియకు సాయం చేయాలని, అవసరమైన న్యాయ సంబంధిత పరిశీలనలు చేస్తూనే అసలైన క్లెయిమ్‌ల పరిష్కారానికి కృషి చేయాలంటూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను సవరించింది. అసలు ఇందులో ఏం మారింది? మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు? ఏమేం డాక్యుమెంట్స్‌ అవసరం అవుతాయి? ప్రతీ మదుపరి తెలుసుకోవాల్సింది ఏమిటో ఒక్కసారి చూద్దాం.

మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరి చనిపోతే.. యూనిట్లు ఎవరికి?

మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఇద్దరు మదుపర్లు కలిసి నిర్వహిస్తున్నప్పుడు.. వారిలో ఒకరు మరణిస్తే, జీవించి ఉన్న మదుపరి రికార్డుల నుంచి మరణించిన వ్యక్తి పేరును తొలగించాలని కోరవచ్చు. అవసరమైతే యూనిట్ల బదిలీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఫండ్‌ సంస్థ ప్రక్రియను పూర్తి చేస్తుంది.

ఒకవేళ మరణించిన వ్యక్తే మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లకు ఏకైక యజమాని అయితే.. రికార్డుల్లో నామినీ ఉన్నట్లయితే ఆ యూనిట్లపై హక్కులను నామినీ పొందవచ్చు. నామినీ లేకపోతే యూనిట్లు చట్టబద్ధమైన వారసులకు బదిలీ అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో అదనపు ధ్రువపత్రాలు, చట్టపరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

నామినీ ఉంటే ఏ పత్రాలు అవసరం?

నామినీ ఉన్న సందర్భంలో సాధారణంగా డెత్‌ సర్టిఫికెట్‌, పాన్‌ కార్డ్‌, కేవైసీ పత్రాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు లేదా సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది.

నామినీ లేని సందర్భంలో ప్రక్రియ మరింత సంక్లిష్టంగా ఉండొచ్చు. వారసత్వ ధ్రువీకరణ పత్రం, కోర్టు ఆదేశం, ఇతర చట్టపరమైన పత్రాలు, అవసరమైతే వారసుల నుంచి ఎన్‌వోసీ వంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు.

నామినీ ఉన్నా.. వివాదం వస్తే?

కొన్ని సందర్భాల్లో నామినీ ఉన్నప్పటికీ ఇతర చట్టబద్ధ వారసులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరి రాసిన వీలునామా కీలకంగా మారుతుంది. స్పష్టమైన వీలునామా లేకపోతే యూనిట్ల హక్కులపై వివాదం తలెత్తే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో చట్టపరమైన పరిష్కారం అవసరం కావచ్చు.

By Ramya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana