హైదరాబాద్‌, ఆగస్టు 7 హైదరాబాద్‌ పాతబస్తీ బండ్లగూడలో ని సలం చెరువు భూమి వ్యవహారంలో కోర్టుకు తప్పుడు సమాచారం అందించారన్న ఆరోపణలపై దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్‌లో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. పు రపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేశ్‌రంజన్‌, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తోపాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖ ల ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసిం ది.

ఈ వ్యవహారంపై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. సలం చెరువులో సాలార్‌ ఎ మిల్లత్‌ విద్యా ట్రస్ట్‌ నిర్వహిస్తున్న బారిస్టర్‌ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని ఇచ్చిన కోర్టు ఆదేశాలు అమలు కాలేదంటూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ కోర్టు ధికరణ పిటిషన్‌ దాఖలుచేశారు.

పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపిస్తూ సర్వే నం.62లోని భూమి చెరువుకే చెందినదని గతంలోనే పలుమార్లు కోర్టు తీర్పులు వెలువడ్డాయని పేరొన్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖలు గత ఏప్రిల్‌ 9న కోర్టును తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చాయని ఆ రోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూ మిలో రిజిస్ట్రేషన్లు అనుమతించడం సరికాద న్నారు. అధికారులపై కోర్టు ధికరణ కింద చర్యలు తీసుకోవాలని కోరడంతోపాటు కలెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఐఏఎస్‌ అధికారులతోపాటు సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.

By Ramya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana