D News: Aug 5: YS Jagan: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దేవరపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చేరుకోనున్నారు. అనంతరం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా స్థానిక పొగాకు రైతులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెట్‌లో లభిస్తున్న గిట్టుబాటు ధరలు, కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక, ఆచరణాత్మక సమస్యలపై రైతులతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

రైతులతో సమావేశం అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. రైతుల నుంచి తెలుసుకున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana