
D News: Aug 4: స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే యువతను ఆకట్టుకునేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన ప్రజాదరణ పొందిన R15 V4, MT-15 వెర్షన్ 2.0 బైక్‌లను మాన్‌స్టర్ ఎనర్జీ మోటోజీపీ ప్రత్యేక ఎడిషన్‌లో విడుదల చేసింది. అదే సమయంలో FZ సిరీస్ బైక్‌లకు కొత్త రంగులను కూడా పరిచయం చేసింది.
రేసింగ్ బైక్‌ల స్ఫూర్తితో రూపొందించిన ఈ మోటోజీపీ స్పెషల్ ఎడిషన్ మోడళ్లపై ఆకర్షణీయమైన ‘మాన్‌స్టర్ ఎనర్జీ మోటోజీపీ’ గ్రాఫిక్స్‌ను అందించారు. ఫ్యూయల్ ట్యాంక్, ట్యాంక్ కవర్లు, సైడ్ ప్యానెళ్లపై ప్రత్యేక డిజైన్‌ను జోడించినప్పటికీ, ఇంజిన్ సామర్థ్యం లేదా మెకానికల్ విభాగాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ధరల విషయానికి వస్తే, యమహా R15 V4 మోటోజీపీ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,76,050గా నిర్ణయించగా, యమహా MT-15 V2.0 మోటోజీపీ స్పెషల్ ఎడిషన్ ధర రూ.1,77,230గా ప్రకటించింది.
FZ సిరీస్‌లో కూడా యమహా కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. FZ-S FI హైబ్రిడ్ మోడల్‌కు ‘ఐస్ స్టార్మ్’ అనే కొత్త రంగును పరిచయం చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న మ్యాట్ బ్లాక్ వేరియంట్‌కు కొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1,39,200 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే FZ-S FI స్టాండర్డ్ మోడల్‌కు ‘మెటాలిక్ బ్లాక్’ రంగును అందుబాటులోకి తీసుకువచ్చి, దీని ప్రారంభ ధరను రూ.1,29,880 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
మోటోజీపీ ప్రత్యేక ఎడిషన్ బైక్‌లు 155 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తోనే కొనసాగుతున్నాయి. ఈ ఇంజిన్ 18.4 హెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, ముందు భాగంలో USD ఫోర్కులు, వెనుక మోనోక్రాస్ సస్పెన్షన్‌ను అందించారు.
భద్రత, సౌకర్యాల పరంగా ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వివిధ రైడింగ్ మోడ్‌లు, క్విక్‌షిఫ్టర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, Y-Connect స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లను ఈ బైక్‌లలో అందుబాటులో ఉంచింది.
