D News: Jul 30: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశం: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాల వారీగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని సూచించారు. ప్రస్తుతం 16 జిల్లాల్లో మాత్రమే నియామక నోటిఫికేషన్లు జారీ అయినట్లు అధికారులు వెల్లడించగా, మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకుని త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించాలని మంత్రి స్పష్టం చేశారు.

అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అవసరమైన కొత్త యూనిఫాంలను అక్టోబర్ తొలి వారంలోగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కొత్త అడాప్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు. ప్రస్తుతం తెలంగాణలో 17 అడాప్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయని అధికారులు సమావేశంలో వివరించారు. అవసరానికి అనుగుణంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు.

పోషకాహారంపై ప్రత్యేక సర్వే: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం వారి శారీరక ఎదుగుదలపై ఎంత ప్రభావం చూపుతోందో తెలుసుకునేందుకు ప్రత్యేక శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సర్వే ఫలితాల ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిగా వినియోగించి, ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతంగా ఉపయోగిస్తూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana