D Entr: Jul 14: శ్రుతి హాసన్ : ప్రముఖ నటి, గాయని శ్రుతి హాసన్ తన జీవితంలో మరో కీలక ఘట్టాన్ని చేరుకున్నారు. చెన్నైలో ఆమె సొంతంగా కొనుగోలు చేసిన కొత్త ఇంటిలో శాస్త్రోక్తంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గృహప్రవేశ వేడుకలో శ్రుతి హాసన్ సంప్రదాయ దుస్తుల్లో సాదాసీదాగా కనిపించారు. తక్కువ ఆభరణాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, వేడుక కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలు, కొత్త ఇంటి తాళంచెవుల ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ గృహప్రవేశ వేడుకకు ఆమె తండ్రి, నటుడు కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.

గత కొన్నేళ్లుగా ముంబైలో నివసిస్తున్న శ్రుతి హాసన్, ఇప్పుడు మళ్లీ తన మాతృనగరం చెన్నైలో స్థిరపడాలని నిర్ణయించుకోవడం విశేషం. గతంలో ముంబైలోని తన ఇంటిని ప్రత్యేక శైలిలో అలంకరించిన ఆమె, చెన్నైలోని కొత్త ఇంటిని కూడా తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దనున్నారని అభిమానులు భావిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, శ్రుతి హాసన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ‘ట్రైన్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్‌లలోనూ పాల్గొంటూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.