
DNews: May04: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులోనే ఓటమి పాలయ్యారు. తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో స్టాలిన్ ఓటమి పాలవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్, కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం డీఎంకే శ్రేణులకు పూడ్చలేని దెబ్బ. కొలత్తూరు నియోజకవర్గంలో ఆరంభం నుంచి హోరాహోరీ పోరు జరిగినప్పటికీ, చివరికి టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు గెలుపొందారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఓటమితో రాష్ట్రంలో అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
