
D Spiritual: Mar 24: ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో మగువలకు ఇష్టమైన ఈ లోహం మరింత ఖరీదైనదిగా మారింది. అయితే ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ ప్రారంభమైన తరువాత బంగారం ధరలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ధరలు గణనీయంగా పడిపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రాబోయే నెలలో బంగారం ధరలపై ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిన్ ఆసక్తికరమైన అంచనాలు వెల్లడించారు. గతంలో ఆయన చేసిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా జనవరిలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని ముందుగానే చెప్పి, అది నిజం కావడంతో ఆయన అంచనాలకు ప్రాధాన్యం పెరిగింది.
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న తరుణంలో ఆయన మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో బంగారం ధరలు మరింత తగ్గి ఒక స్థాయిలో స్థిరపడతాయని తెలిపారు.
ఆయన అంచనా ప్రకారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,000 నుండి రూ.12,000 మధ్యలో స్థిరపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రభావంపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపగలవని, అవసరమైతే ధరలను దిగజార్చే సామర్థ్యం కూడా వారికి ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
