Tamil Nadu Assembly Elections: Alliance finally formed-DTv Telangana

DNews: Mar23: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. సుదీర్ఘ చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై ఒక అంగీకారానికి వచ్చారు. ఈ పొత్తులో భాగంగా, బీజేపీకి 27 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి అంగీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఏడు అదనపు సీట్లు లభించాయి. దీనికి అదనంగా, ఈ పొత్తులో ప్రస్తుత పీఎంకే పార్టీకి 18 సీట్లు, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీకి 11 సీట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ పొత్తుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సంతకాలు చేశారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గట్టిగా ఎదుర్కోవాలంటే ఓట్లు చీలిపోకూడదని, అందుకే పాత మిత్రపక్షాలన్నీ మళ్లీ ఏకం కావాలని నిర్ణయించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కూటమి, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో పట్టున్న ఉన్న ఏఎంఎంకే, ఉత్తర తమిళనాడు లో బలంగా ఉన్న పీఎంకే, మరియు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి కూటమిగా గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana