DNews: Mar 14: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ వంటగదులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వంటగ్యాస్ (LPG) దిగుమతులు ఆగిపోవడంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. మన దేశం పూర్తిగా ఇతర దేశాలపై LPG కోసం ఆధారపడటం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తయారు చేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) డైమెథైల్ ఈథర్ (Dimethyl Ether – DME) ను LPG కి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. IICT డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి ప్రకారం, పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించి డైమెథైల్ ఈథర్ తయారు చేయవచ్చు. LPGలో ప్రొపేన్, బ్యూటేన్ వాయువులు ఉంటాయి. డైమెథైల్ ఈథర్ కూడా వీటికి చాలా దగ్గరగా ఉండే గ్యాస్. అందువల్ల, ప్రస్తుత LPG వ్యవస్థల్లో చిన్న మార్పులతోనే దీన్ని ఉపయోగించవచ్చు.
డైమెథైల్ ఈథర్‌ను LPGకి మాత్రమే కాకుండా డీజిల్‌కు కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాదిలో భాగంగా రోజుకు 180 కిలోల డైమెథైల్ ఈథర్ ఉత్పత్తి చేసే పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా డైమెథైల్ ఈథర్ ఉత్పత్తి ప్లాంట్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. IICT, BHELతో కలిసి ఈ వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ (CST) మద్దతు లభించింది.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, LPG దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా వంటగ్యాస్ అవసరాలను తీర్చుకోవచ్చు. అంతేకాకుండా, పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana