DNews: Feb 21: 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6:50 గంటలకు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని కోనార్క్ థియేటర్ వద్ద రెండు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది శరీర భాగాలను కోల్పోయి ఇప్పటికీ వికలాంగతతో బాధపడుతున్నారు. ఈ ఘటనను ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా నిర్వహించింది. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి యాసిన్ భట్కల్. అతను మరో ఐదుగురితో కలిసి అబ్దుల్లాపుర్‌మెట్‌లోని ఒక ఇంటిలో బాంబు పేలుళ్లకు పథకం రచించాడు. పాత సైకిళ్లు, రెండు కుక్కర్లు కొనుగోలు చేసి వాటిని శక్తివంతమైన ఐఈడీ బాంబులుగా మార్చి, అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంచారు. సైకిళ్లు పార్క్ చేసిన కొద్ది సేపటికే బాంబులు పేలడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై NIA కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. యాసిన్ భట్కల్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసింది. ప్రత్యేక విచారణలో NIA కోర్టు 2016లో నిందితులకు ఉరిశిక్ష విధించింది. అనంతరం వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా అదే తీర్పును కొనసాగించింది. ఈ రోజు పేలుళ్లకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్‌లో ఉన్నారు. కోనార్క్ థియేటర్‌తో పాటు దిల్‌సుఖ్‌నగర్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana