
DNews: Feb 19: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు రెండు సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 28న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 10 నుండి 15 రోజుల వరకు కొనసాగించే అవకాశం ఉంది. బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. ఆర్థిక మంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు సమీక్షలు నిర్వహించారు.
