
DNews: Feb11: కేంద్ర ప్రభుత్వం ఏపీకి శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులతో సమావేశం నేపథ్యంలో.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్రం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టుకు నిధులు త్వరగా అందితే, పనులు ప్రారంభిస్తే.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ నగరాల జాబితాలో చేరుతుంది. విశాఖపట్నం ఏపీ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపడంతో విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
