DNews: Feb 10: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. రేపు జరగబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు, గత కే‌సీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందువల్ల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని అన్నారు.
ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 8 లక్షల 19 వేల కోట్ల అప్పులో ముంచిందని, ప్రస్తుతం నెలకు 6,300 కోట్ల రూపాయలు అప్పు చెల్లింపులకే వెచ్చిస్తున్నామని అన్నారు. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధరలతో పాటు బోనస్ ఇస్తున్నామని, విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి సమగ్ర పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు.
ఇందిరమ్మ హౌస్ పథకంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇళ్లను చూపించి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లను ఆమోదించిందని, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నగరాల్లో స్థలాలు లేని పేదల కోసం G+3 ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను అధికారులతో మాట్లాడిన టెలికాన్ఫరెన్స్‌లు బయటకు వస్తున్నాయంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అన్నారు. ఇది ఫార్మ్‌హౌస్‌ నుంచి జరుగుతోందని ఆధారాలు ఉన్నాయని, సాధారణ ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఎవరూ చట్టానికి తప్పించుకోలేరని హెచ్చరించారు.
తాను సీఎం పదవికి పోటీదారుడిని కాదని, కాంగ్రెస్ పార్టీకి సాధారణ కార్యకర్తనని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు అసభ్య పదజాలం వాడుతున్నారని, ప్రజలు ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana