D Spiritual: Feb 6: వైసీపీ పాలనలో అనేక వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

“సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలు ఉంటాయి. కానీ వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్‌చిట్ ఇవ్వలేదనేది వాస్తవం,” అని పవన్ వ్యాఖ్యానించారు. సున్నితమైన అంశాలపై ఆలోచించి మాట్లాడాలని కూడా ఆయన సూచించారు.

ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని తీవ్రంగా విమర్శించారు.

ఈ అంశంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana