DSports 31Jan 2026:పనాజీ/మెల్‌బోర్న్: అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్‌తో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన పోరులో రోహన్ కున్నుమ్మల్‌ను అవుట్ చేయడం ద్వారా అర్జున్ తన కెరీర్‌లో 50వ ఫస్ట్ క్లాస్ వికెట్‌ను సాధించాడు. కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తూ అసలైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

  • 2022/23 సీజన్‌లో గోవా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అర్జున్, తన డెబ్యూ మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో అర్జున్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు పడగొట్టి గోవా జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అర్జున్ ఇప్పటికే ఒకసారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5-wicket haul) చేశాడు.

సచిన్ టెండూల్కర్ బ్యాటర్ అయినప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బంతితోనూ మంచి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అర్జున్ తన తండ్రి రికార్డును అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana