DSports 31Jan 2026:దుబాయ్/లాహోర్: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి. భారత్‌లో ఆడటానికి నిరాకరించి టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు మద్దతుగా, తాము కూడా తప్పుకుంటామని పాక్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశానికి ఇప్పుడు ‘ఉచ్చు’లా మారాయి. అటు ఐసీసీ హెచ్చరికలు, ఇటు చిన్న దేశాల సెటైర్లతో పాక్ క్రికెట్ పరువు గాల్లో కలిసిపోతోంది.

  • ఒకవేళ పాకిస్థాన్ గనుక టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ నుంచి రావాల్సిన సుమారు $34.5 మిలియన్ల (రూ. 316 కోట్లు) వార్షిక ఆదాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించింది.చట్టబద్ధమైన ఒప్పందాన్ని (TPA) ఉల్లంఘిస్తే పీసీబీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడంతో పాటు, 2028లో పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సిన మహిళల ప్రపంచకప్ హక్కులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
  • పాక్ ఇంకా సందిగ్ధంలో ఉండగానే, చిన్న దేశాలు సోషల్ మీడియాలో పాకిస్థాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాయి. “పాకిస్థాన్ రాకపోతే ఆ సీటు మాకు ఇవ్వండి.. మా పాస్‌పోర్టులు కూడా రెడీగా ఉన్నాయి” అంటూ ఉగాండా క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫన్నీ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు ఐస్‌లాండ్ క్రికెట్ కూడా “మా ఆటగాళ్లు ఆఫీసులకు సెలవు పెట్టి రాలేరు కానీ, పాక్ బదులు మేం ఆడతాం” అంటూ ఎగతాళి చేసింది. ఒక దిగ్గజ జట్టుగా చెప్పుకునే పాకిస్థాన్‌కు ఇలాంటి చిన్న దేశాల నుంచి ట్రోల్స్ ఎదురవ్వడం తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana