DET:DEC 30:
మలేషియాలో చరిత్ర సృష్టించిన ఆడియో లాంచ్:
విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు చేస్తున్న ఆఖరి చిత్రం కావడంతో మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో నిర్వహించిన ఆడియో లాంచ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు.సుమారు 85 వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.గతంలో ఏ భారతీయ సినిమా ఆడియో లాంచ్ ఇంత భారీ ఎత్తున విదేశాల్లో జరగలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

విడుదలకు ముందే బడ్జెట్ రికవరీ:
సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాత లాభాలను గడిస్తాయి కానీ జన నాయగన్ మాత్రం బాక్సాఫీస్ వద్దకు రాకముందే తన నిర్మాణ వ్యయాన్ని వెనక్కి తెచ్చేసుకుంది.సినిమా షూటింగ్ పూర్తికాకముందే శాటిలైట్ డిజిటల్ మరియు ఆడియో హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది.దీనివల్ల నిర్మాతలు సినిమా విడుదల కాకముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లారు.

రూ 350 కోట్ల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్:

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని రకాల రైట్స్ కలిపి రూ.350 కోట్ల నుండి 400 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.110 కోట్లకు దక్కించుకోగా తమిళనాడు థియేట్రికల్ హక్కులు రూ.100 కోట్లకు పైగా పలికాయి.ఆడియో హక్కులు కూడా రూ.35 కోట్లకు అమ్ముడవడం విశేషం.

అగ్ర దర్శకుడు మరియు భారీ తారాగణం:
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.మమితా బైజు,ప్రకాష్ రాజ్,గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల:
విజయ్ కెరీర్‌లో 69వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లనుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana