
DNews: Dec27:తిరుమల తిరుపతి దేవస్థానం లో 33 మంది హిందూయేతర ఉద్యోగులను VRS కు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోర్డు ఇటీవల ఆమోదించిన తీర్మానం ప్రకారం వారు రాబోయే పది రోజుల్లోపు తమ సమ్మతి పత్రాలను సమర్పించాలని వారికి అవగాహన కల్పించారు. ఉద్యోగంలో చేరినప్పుడు తాము హిందూ లు కాని వారమని వారు నిర్ధారించారు. వారిలో తొమ్మిది మంది ఇప్పటికే పదవీ విరమణ చేయగా, మిగిలిన 33 మంది VRS తీసుకోవాలి. వీరిలో 24 మందికి పెన్షన్ సౌకర్యాలు ఉండగా, మరో తొమ్మిది మందికి పెన్షన్ సౌకర్యాలు లేవు. ఉద్యోగంలో చేరినప్పుడు హిందువులమని చెప్పుకుని, తరువాత అన్య మత ప్రార్థనలకు వెళ్లే వారు తితిదేలో పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం. ఇటీవల ముగ్గురు ఉద్యోగులను ఆధారాలతో గుర్తించి వారిని తొలగించారు. అదే విధంగా వెళ్తున్న మరో 125 మంది వివరాలను తితిదే సేకరించినట్లు సమాచారం.
