DSport Dec26 2025:తిరువనంతపురం: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించి 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన, నేడు (శుక్రవారం) తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20లో లంకతో ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

వరుసగా మూడు విజయాలతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలం.యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ, దీప్తి శర్మలు లంక బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. గత మ్యాచ్‌లో వైష్ణవి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.సిరీస్‌లో నిలవాలంటే చామరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టుకు ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana