
DNews: 20 Dec: గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరిగాయి. అయితే, డాలర్ కూడా స్వల్పంగా బలపడటంతో, బంగారం, వెండి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,170గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే సుమారు రూ. 680 తక్కువ. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ. 620 తగ్గి రూ. 1,22,990కి చేరింది. వెండి ధర కూడా సుమారు రూ. 3000 తగ్గి రూ. 2,08,900కి చేరింది.
త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కావడం, డాలర్ బలపడటం, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో పెట్టుబడిదారుల దూకుడు తగ్గడం వల్ల బంగారం, వెండి ధరలు కొంత నెమ్మదించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా కొనసాగుతుండటంతో, వచ్చే ఏడాది మరోసారి ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై ఆశలు పెరుగుతున్నాయి. అందువల్ల, ధరలలో ప్రస్తుత తగ్గుదల కేవలం స్వల్పకాలిక సవరణ మాత్రమే అని వారు చెబుతున్నారు.
